

జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి : పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, చవ్వ శ్రీనివాస సుబ్బారావు అన్నారు. భీమవరం పట్టణ బిజెపి పడమర అధ్యక్షులుగా వబిలిశెట్టి ప్రసాద్, తూర్పు అధ్యక్షులుగా అడబాల శివ ఎన్నికైన సందర్బంగా శనివారం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో అభినంద సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీతలు ప్రసాద్, శివ మాట్లాడుతూ ఇచ్చిన పదవులను బాధ్యతగా చిత్తశుద్దిగా నిర్వర్తిస్తామని అన్నారు. భీమవరం నియోజక వర్గ బిజేపి కన్వీనర్ కాగిత సురేంద్ర, కారుమూరి సత్యనారాయణ మూర్తి, మానేపల్లి వెంకన్నబాబు, గుండు సుదీర్, కురిశెట్టి కాశి,పరుచూరి నాగేశ్వరావు,కురిశెట్టి శ్రీకాంత్, మానేపల్లి రవి చిన్నారావు, అనoతపల్లి సుబ్బారావు,కంచర్ల భాస్కరరావు గుప్తా,బాయ్స్ శ్రీనివాస్,ఆర్.మణి మోహనరావు, గాదెనాగేశ్వరావు,కొల్లేపర్ల సుబ్బారావు,పున్నాని కన్నయ్య పాల్గొన్నారు.