

జనం న్యూస్ 22 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా రాజుల కాలం నాటి చరిత్రఆత్మకమైన కొత్త బావి కట్టడాలను కబ్జా బకాసురుల నుండి కాపాడుకుందాం.గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా రాజుల కాలం నాటి సంస్థానాదిశులకు చెందిన ((కొత్త బావి)) సంరక్షించాల్సిన బాధ్యత అందరిది!!!! అన్య క్రాంతంనికి గురైన ఇ బావిని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ అనుమతి లేకుండా బావి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించ తలపెట్టిన సందర్భంలో గతంలో మున్సిపల్ కమిషనర్ జనవరి మాసంలో కలెక్టర్ దృష్టికి తీసుకొని పోగా నేటి వరకు ఎటువంటి ప్రభుత్వ పరంగా కార్యాచరణ స్పందించకపోవడం వలన మాజీ మున్సిపాలిటీ చైర్మన్ జి వేణుగోపాల్ స్థానిక రాజకీయ నాయకుల అండతో బావిని మట్టితో కూల్చడానికి కార్యాచరణ రూపొందించడాని అక్రమ మట్టితో బావిని పూడ్చుచున్నాడు. ఇట్టి విషయం ద్వారా తెలియజేస్తూ సంస్థానా దిశల కాలంనాటి కట్టడాలను బావులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారన్నారు తక్షణమే రాజుల కాలం నాటి చరిత్రాత్మకమైన కట్టడాలను కబ్జాదారుల నుండి రక్షించాలని అన్నారు లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అక్రమ కట్టడాన్ని నిలిపివేసి చిట్టుముట్టు ఫెన్సింగ్ చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు సార్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావు వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
శంకర ప్రభాకర్ పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శుభాన్ తెలంగాణ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజ్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్.IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి,జమ్మిచేడు కార్తీక్.AISF ప్రవిన్ BRS వాల్మీకి, కోళ్ల హుస్సేన్ CPI రంగన్న.