


ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ని ఎం పీ డీ వో ఆఫీస్ పక్కన ఇందిరమ్మ మోడల్ హౌస్, ను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్, పరిశీలించడం జరిగింది. దాని తర్వాత శివరాం రెడ్డి పల్లి, గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గు వేయడం జరిగింది. దాంతో యాడారంలో నర్సరీ డ్రింకింగ్ వాటర్ సానిటేషన్ పనులు పరిశీలించడం జరిగింది. మల్కాపూర్, గ్రామపంచాయతీలో సిసి రోడ్ల పనులు పరిశీలించడం జరిగింది. తర్వాత బీబీపేట్ గ్రామపంచాయతీ లో ఎల్ ఆర్ ఎస్ కింద పేమెంట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్, ఎం పీ డీ వో పూర్ణ చంద్రోదయ కుమార్, ఈ వో రమేష్, పాల్గొన్నారు.