

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. పోలీసుల అరెస్టులను చేదించుకొని చలో హైదరాబాద్ కు తరలి వెళ్లిన టియూసీఐ నాయకులు ఉద్యమాలను అణిచివేస్తే మరింత ప్రతిఘతీస్తాం. ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి అని, ఈ రోజు 22-03-25 న
హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు కార్మికులు, కార్మిక నేతలు పోకుండా ముందస్తు అరెస్ట్ లకు పాల్పడ్డది అయినా పోలీసుల అరెస్టులను చేదించుకొని చలో హైదరాబాద్ కు టియూసీఐ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్బంగా టియూసీఐజిల్లా కార్యదర్శి ఆర్. రమేష్. మాట్లాడుతు ప్రభుత్వం కార్మిక వర్గం ఎదురకొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే తాము మరింత ప్రతిఘతీస్తాం.అని టియూసీఐజిల్లా కార్యదర్శి ఆర్. రమేష్. హేచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి అని, ఈ రోజు 22-03-25 న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వెళ్లకుండా టియూసీఐ నేతలు ఆర్మూర్ లో ఎం. ముత్తేన్న, ఎం.డి.నశిర్,జి. అరవింద్, కమ్మర్ పల్లిలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ జిల్లా నాయకులు ఎస్.సురేష్, ఏ. అశోక్, టియూసీఐ నాయకులు వి. బాలయ్య, బోధన్ లో టియూసీఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, తదితర నాయకులను పోలీసులు ముందస్తుగా, అరెస్టు చేశారన్నారు. గత ప్రభుత్వం కనీస వేతనాలకు సంబందించిన 5 జీ వో లను చేసి, గెజిట్ చేయకుండా నిలుపుదల చేసిందని, ఆ జీ వో లను వెంటనే ఈ ప్రభుత్వం అయినా గెజిట్ రూపంలోకి ముద్రించాలని,సంఘటిత,అసంఘటిత రంగం లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపడానికి వెళ్తున్న ట్రేడ్ యూనియన్ నాయకులు ను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, అక్రమ అరెస్టులను కార్మికులు,ప్రజాస్వామిక వాదులు ఖందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమంకు తరలి వెళ్లిన వారిలో టియూసీఐ జిల్లా ఉపాధ్యక్షురాలు వి. సత్తేవ్వ, జిల్లా నాయకులు కే. రాజేశ్వర్, , ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆశన్న ధర్పల్లి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియూసీఐ ) అధ్యక్షులు, సాయిలు, లింగం, సిరికొండ మండల అధ్యక్షులు, బాలకిషన్, బీంగల్ నాగరాజు, ఆర్మూర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.