Listen to this article

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకులు మల్కి. లింబాద్రి. పిలుపు యువకిశోరం సర్దార్ షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సభలను, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుపాలని అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకులు మల్కి. లింబాద్రి.పిలుపును ఇచ్చారు. శనివారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆయన పేస్ మీట్ లో మాట్లాడుతు: బ్రిటిష్ సామ్రాజ్యంకు వ్యతిరేకంగా విప్లవ కార్యాచరణతో పోరాడిన యోధుడు కామ్రేడ్. భగత్ సింగ్ అని ఆయన మతంకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అన్నారు. ఈరోజు గ్రామాల్లో మతం చిచ్చుపెడుతుంది అని గ్రామీణ ప్రజల్లో చిచ్చుపెడుతుంది అన్నారు. మతం ప్రస్తుతం అత్యంత ప్రమాధికారీగా మారిందని. యువకులు, విద్యార్థులు, అశేష ప్రజానీకం పెద్దఎత్తున కామ్రేడ్. భగత్ సింగ్ కు నివాళులు హార్పించాలనీ, స్మరించుకోవాలి అని ఆయన కోరారు.కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నేతలు పి. రమ, ఎస్. గంగామణి, ఎం డి. అనిస్, బి. కిశోర్, గట్ల.కిరణ్, ఎం. ,కట్ట.రాములు, ఎస్ కిశోర్, బి. లావణ్య, మల్కి. లత, నిమ్మల. రాములు తదితరులు పాల్గొన్నారు.