

జనం న్యూస్ మార్చ్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పుణ్యవతి వరి పొలాలను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరు లో చీడపీడలు ,తెగులు రాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరి పైరును కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. వరి పైరులో ఆరుతడి యాజమాన్యం ద్వారా నీటిని సరఫరా చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట రాజశేఖర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారినిలు కృష్ణవేణి, దివ్యశ్రీ రైతులు కృష్ణ పాల్గొనడం జరిగింది