

జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో చలివేంద్ర కార్యక్రమాన్ని ఉమ్మడి గండేడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర త్రాగునీరు ప్రారంభించడం జరిగింది. రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ సమస్య అనుకోని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాకేష్, గ్రామ పార్టీ సీనియర్ నాయకులు వి నరసింహ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అసేన్, ఈ మాణిక్యం, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.