Listen to this article

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలములో నిన్న కురిసిన వడగండ్ల వాన వల్ల మండలములో వరి పంట నష్టం వాటిల్లడం జరిగినది. మండలంలోని కొండూర్,చిన్న వాల్గొట్, సిరికొండ, చిమాన్ పల్లి గ్రామాలలో వరి పంట నష్టం సుమారు 700-750 ఎకరాలు గా ప్రాథమిక అంచనా ఉన్నది. ఏవో మరియు ఏ ఈ ఓ.లు పంట పొలాలను సందర్శించి అంచనా వేశారు.
ఈ రోజు ఏడిఏ నిజామాబాదు ప్రదీప్ కుమార్, ఏమిఏఓ. నర్సయ్య,ఏఈఓ. మోహన్ మరియు రైతులు పాల్గొన్నారు.