



జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ( ఎం పి యు పి ఎస్) అంగడికిష్టాపూర్ పాఠశాలలో Strengthening అఫ్ ప్లాన్ యూసింగ్ ఏఐ టూల్స్, కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ( సెక్ట్రల్ ) అధికారి భాస్కర్, మర్కుక్ మండల విద్యాధికారి వెంకటరాములు, చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాస్కర్, మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. మండల విద్యాధికారి, వెంకట రాములు, మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మండలంలో మొట్ట మొదటగా ఈ పాఠశాలలో ప్రారంభించినoదుకు పాఠశాల, హెచ్ ఎం ను అభినందించారు.అదేవిధంగా అతి త్వరలో మండలంలోని మరిన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్, ( ఎస్ ఎం సి ) చైర్మన్ బాల్రెడ్డి,ప్రధానోపాధ్యాయులు బాలకిషన్, ఉపాధ్యాయులు సంతోషి మాత,హారిక, చిన్నికృష్ణ, నవీన తదితరులు పాల్గొన్నారు
