Listen to this article

తెరుచుకొని బస్తీ దవాఖాన- ఇబ్బందులు పడుతున్న ప్రజలు జనం న్యూస్ – మార్చి 23-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో పేద ప్రజల సౌకర్యార్థమై మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో నిర్మించిన బస్తీ దవాఖాన ప్రారంభించకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇట్టి విషయమై నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సైతం విన్నవించుకున్న ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం, ఇప్పటికైనా పేద ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్తీ దవాఖాన త్వరగా ప్రారంభించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. బస్తీ దవాఖానను వెంటనే ప్రారంభించాలి -రమేష్ జి టిఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్ జి మాట్లాడుతూ పేద ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్తీ దవాఖాన ప్రారంభించాలని ఇప్పటికే పలుమార్లు నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని, అయినా కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున నల్లగొండ జిల్లా కలెక్టర్ పరిపూర్ణ ను కలిసి వినతి పత్రం ఇచ్చామని, అదే సమయంలో అక్కడే ఉన్న డిఎంహెచ్వో శ్రీనివాసులు పిలిచి పైలాన్ కాలనీలో నిర్మించిన బస్తీ దవాఖాన ను వెంటనే ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారని, అయినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు, ఇట్టి విషయమై రేపు సోమవారం నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ లో జరిగే గ్రీవెన్స్ డే లో మళ్లీ వినతి పత్రం ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.