Listen to this article

జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ కెనాల్స్ ఒకటో వార్డు పరిధిలో రోడ్డుని ఆక్రమించేసిన ఆక్రమణదారులు గల్లీ రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తూ మిగతా రోడ్డు స్థలాన్ని విక్రయించేందుకు కూడా సిద్ధపడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇట్టి విషయమై గత సంవత్సరం డిసెంబర్లో బిఎండర్ డివిజన్ అధికారికి మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని అదేవిధంగా విజయపురి టౌన్ ఎస్ఐ కూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని స్థానికులు తెలిపారు, బిఎండర్ డివిజన్ అధికారులుపోలీస్ అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి ఎవరు ఎటువంటి కట్టడాలు కట్టరాదని పనులు ఆపి వేయించారని తెలిపారు, కొంతకాలం సద్దుగా ఉన్న ఆక్రమణదారులు తిరిగి ఇప్పుడు మళ్లీ అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు, 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇట్టి దారిని ఏ విధంగా కబ్జా చేస్తారని స్థానికులు వాపోతున్నారు, ఇట్టి కబ్జాల విషయమై స్థానిక బిజెపి ఎస్సీ మోర్చా నాయకుడు కే రాందాస్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా 50 గృహాలకు పైగా ఇదే దారిని ఉపయోగించుకునే వారని అట్టి దారిని ఇప్పుడు కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం అని, ఇట్టి విషయమై నల్లగొండ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తున్నామని, నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కబ్జాలు అధికమయ్యాయి అని అన్నారు, రాజకీయ నాయకుల అండతోటే కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు.