Listen to this article

జనం న్యూస్ మార్చ్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ డివిజన్ 10,11,12 సచివాలయాల పరిధిలో మహిళలకు అవగాహన కల్పించడానికి నోడల్ ఆఫీసర్ పరదేశి నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ 84 వ వార్డు ఇన్చార్జ్ మాదంశెట్టి నీల బాబు తెలిపారు. ఇంటింటికి సమగ్ర సర్వేలో సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పడం లేదని ప్రభుత్వ పథకాలు పోతాయేమోనని అనుమానాలతో వివరాలు చెప్పడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తుందని మహిళలకు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారం గత వైసిపి పాలనలో విధించిన ఆరు నిబంధనలను ప్రభుత్వం తొలగించిందని, మీ ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, ఫ్యాన్లు ఫ్రిజ్లు ఏసీలు మిక్సర్లు ఏమున్నాయో వివరాలు చెప్పడం లేదని సచివాలయం అధికారులు మహిళలకు వివరించారు. కనుక సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారు అడిగిన వివరాలు సంపూర్ణంగా తెలియజేయండి. సంక్షేమ పథకాలు ఇప్పుడు వచ్చిన విధంగానే వస్తాయని మహిళలకు అవగాహన కల్పించారని నీలబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12 సచివాలయం అడ్మిన్ ఉదయ్ భాస్కర్ 10 సచివాలయం అడ్మిన్ మంగప్పారావు 11వ సచివాలయం అడ్మిన్ బి శిరీష తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ని రామకృష్ణ దొర కుప్పిలి జగన్ కోట్ని రాంబాబు తలారి లక్ష్మీప్రసాద్ పిళ్ళా తారకేష్ కాండ్రేగుల జగదీశ్వరరావు ఆడారి రవి గుమ్మడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.