Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం మార్చి 22. సమాజంలో వివిధ రంగాలలో తమదైన ప్రత్యేక మైన శైలితో తమకంటూ ఓ స్థానం సృష్టించుకున్న ధీరవనితల యొక్క స్ఫూర్తివంతమైన జీవితాలను పరిచయం చేస్తూ అమెరికా లోని ఎన్నారై డా.జాస్తి శివరామ కృష్ణ,అయ్యల సోమయాజుల అహల రచించిన షీరోస్ -256 లోని పాత్రల ఏకపాత్రాభినయాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నారెడ్డి పల్లె నందు 26 మంది విద్యార్థినులు 26 పాత్రలను ఎన్నుకొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు శ్రీ వై. శ్రీనివాసరావు షీరోస్ జీవితాలను చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమ సమన్వయకర్త ఒ.వి రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చక్కని అభినివేశం తో ఆకట్టుకున్న విద్యార్థినుల ప్రతిభను చూసి పుస్తక రచయత శివ అభినందించారని,మీ జీవితాల్లో మీరు కూడా ఎన్నుకున్న రంగాలలో మీ ముద్రను వేసి షీరోలుగా ఎదగండి అని, పుస్తకం పూర్తిగా చదివి వారి ఆశయాలను, కృషి పట్టుదల లను స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణ పొందండి అని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ ను ప్రదర్శించిన సాయి మానస, దివ్య,గాయత్రి లకు షీరోస్ పుస్తకాన్ని, విద్యార్థినులందరికి ప్రశంసా పత్రాలను మహిళా ఉపాధ్యాయులు జి.శోభారాణి, వి. వి. హెచ్ హేమలత,బి.సుజాత,డి.హేమలత బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఒ.నరసింహారావు,పి. కోటిమోహన్, ఎ. శంకర్ రెడ్డి, ఎస్. కిషోర్, ఆర్. అచ్చయ్య పాల్గొని విద్యార్థినులను అభినందించారు.