Listen to this article

జనం న్యూస్ మార్చ్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ఎం.జగన్నాధపురం గ్రామంలో పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి , ష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమ న్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలిద్దాం అందరూ సహకరిం చాలన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిసరాల్లో పరిశుభ్రతపై కూడా ఉండాలని ఆయన దేశించారు..అనంతరం గ్రామంలో టిఫిన్ షాప్ కి కాయగూరల షాప్ కి డస్ట్ బిన్ లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. పర్యావరణన్ని కాపాడాలని కోరారు. మరియు ప్రపంచ నీటి దినోత్సవ సందర్భంగా భూగర్భ జలాలు పెంపొందించే దిశగా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫాం పౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. అధికారులు, సర్పంచ్ జనసేన, టిడిపి ,బిజెపి నాయకులు గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.