

ప్రభుత్వాలను మార్చే సత్తా రైతులకుంది.. ఓటుబ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి రైతులను ఆదుకుందాం.. రైతులే ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి అధిక లాభాలు పొందేలా చేద్దాం..
అధిక జనసాంద్రత పత్తిసాగు విధానాన్ని ప్రోత్సహిద్దాం..
జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు..
జనం న్యూస్ // మార్చ్ // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కేవీకే ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆధిక జనసాంద్రత పద్దతిలో పత్తిసాగు కిసాన్ మేళా’ నిర్వహణ కార్యక్రమం , శనివారం రోజు జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ రావడం జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని (కెవికె) బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. లేనిపోని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా రైతులను మోసం చేసే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. రైతులు ఏడ్చిన రాజ్యం, బాగుపడ్డ చరిత్ర లేదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చివేయగలరని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్రాలపైనా ఉందన్నారు. రైతులే ఉత్పత్తిదారులుగా మారి సంఘాలుగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ సహాకారంతో కేవీకే ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన ‘‘అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగుపై కిసాన్ మేళా’’ కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జమ్మికుంట క్రుషి విజ్ఝాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలు భేష్. రైతులను ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవు. తెలంగాణలో 43 లక్షల76 వేల 043 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 44 వేల 675 ఎకరాల్లో సాగవుతోంది. పాత పద్దతిలో పత్తి సాగు చేయడం రైతులకు భారమైంది. అకాల వర్షాలు, గులాబీ పురుగు దాడి…పెట్టుబడి ఖర్చులు పెరిగి అప్పలపాలు వంటి అంశాలతో రైతులు పత్తి పంట వేయడానికి వెనుకాడుతున్నారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమ దెబ్బతినే ప్రమాదముంది అన్నారు. పాత పద్దతితో ఎకరాకు 5,555 నుండి 7,400 వరకు పత్తి మొక్కల సాగు చేయగలుగుతున్నాం. అట్లాగే పంట కాల వ్యవధి 180 రోజులు.. రెండో పంటకు అవకాశం కూడా లేదు. మిషన్ల ద్వారా పత్తిని తీసే అవకాశం లేదు. కూలీలతో 3 నుండి 4 సార్లు పత్తి తీయించాల్సి రావడంతో సాగు వ్యయంలో 25 శాతం కూలీలకే చెల్లించాల్సి వస్తోంది, అని తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక సాంద్రత పద్దతితో నూతన పత్తి విధాన సాగు చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. ఈ పద్దతిలో ఒక్కో ఎకరాకు 14 వేల నుండి 29 వేలకుపైగా పత్తి మొక్కలు వచ్చేలా విత్తుకోవచ్చు. ఎకరాకు 10నుండి12 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం ఉంది. పత్తిని ఒకేసారి తీసుకోవచ్చు. మెషిన్ ద్వారా పత్తిని తీసే అంశంపై పరిశోధనలు కొలిక్కి వస్తోంది, అని వివరించారు. కూలీల భారం ఉండదు. 150 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ప్రత్యామ్నాయంగా రెండో పంట వేసుకునే అవకాశం ఉంది. తద్వారా భూసారం పెరుగుతుంది. అని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసార కార్డులిస్తోంది. జమ్మికుంట క్రుషి విజ్ఝాన కేంద్రం(కేవీకే) గతేడాది 105 మంది రైతులతో 208 ఎకరాల్లో అధిక సాంద్రత పద్దతిలో సాగు చేయడం ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు 3,500 నుండి 4,500 రూపాయల ప్రోత్సాహాన్ని మోదీ ప్రభుత్వమే నేరుగా అందిస్తోందన్నారు. ఈ ఏడాది 260 మంది రైతులతో 508 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీరి ఖాతాల్లో 13 లక్షల రూపాయలు జమకానున్నాయి.
అట్లాగే రైతులే ఉత్పత్తిదారు సంస్థలుగా(ఎఫ్ పీవో అంటే ఫార్మర్ ప్రోడ్యూసర్ ఆర్గనైజేషన్స్)గా ఏర్పడాలన్నది మోదీ, ఉద్దేశం…దేశవ్యాప్తంగా 10 వేల ఏర్పాటు లక్ష్యం.. 2021లోనే 6865 కోట్ల కేటాయింపు. ఒక్కో ఎఫ్‌పీవో కు 15 లక్షల వరకు సాయం… ఎఫ్ పి ఓ ల అర్హతను బట్టి 2 కోట్ల రూపాయల వరకు రుణ సౌకర్యం… ముల్కనూర్ పాల ఉత్పత్తిదార్ల సంఘం లెక్క పత్తి రైతులంతా కలిసి ఎఫ్ వివో లుగా ఏర్పడాలి. 1.నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటివి రైతులకు సరఫరా చేయాలి. 2.సభ్యుల కోసం అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, సామగ్రిని అందుబాటులో ఉంచాలి 3. రైతు సభ్యులు పండించిన పంటను అమ్మడం కోసం ఒకేచోటికి చేర్చాలి. 4.వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయడం, పరీక్షించడం, క్రమబద్ధీకరించడం, గ్రేడింగ్, చేయడం, ప్రాసెసింగ్ చేయడం వంటి పనులు చేస్తూ వాటి విలువను పెంచి అధిక లాభాలు సంపాదించాలి, అన్నారు.ఆ సంపదను రైతులకే పంపిణీ చేయాలి. తద్వారా స్థిరమైన లాభాలను అందించాలి అని అంతేతప్ప రైతులను ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూడొద్దన్నారు.. అట్లా చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా రైతు ప్రయోజనాలు అంతిమంగా పనిచేయాలి. అంతేతప్ప లేనిపోని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తే ఏ రాజకీయ పార్టీకి కూడా పుట్టగతులుండవన్నారు. ఎందుకంటే రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చివేస్తారు. ఇది గమనించాలి. రాష్ట్రంలో రైతులు లాభాల కోసం పంటల సాగు చేసే పరిస్థితి లేదు. అప్పుల నుండి బయట పడాలని, అని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సాగు చేస్తున్నారే తప్ప కోటీశ్వరులు కావాలనే ఆలోచన రైతులకు లేనేలేదు అని పేర్కొన్నారు.
