Listen to this article

జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర మాస్టిన్ సంఘం హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీని శనివారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేల్లి నరసయ్య తెలిపారు. మాస్టిన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పొన్నాల అంజి,రాష్ట్ర కార్యదర్శిగా ఇటికాల మధు,రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాగెల్లి రాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నాగిల్లి రాజు, కోశాధికారిగా నాగేల్లి గోపి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బత్తిని సతీష్, ప్రచార కార్యదర్శిగా నాగెల్లి చిరంజీవి,రాష్ట్ర ముఖ్య నాయకులుగా నాగేల్లి పార్థ సారధి, పొన్నాల ప్రవీణ్ లను రాష్ట్ర కమిటీలకు తీసుకున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగెల్లి నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పొన్నాల అంజి మాట్లాడుతూ, మాస్టిన్ సంఘం అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలలో ఉన్న మాస్టిన్ సోదరుల సమస్యల కోసం పోరాడి హక్కుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. సమస్యలో భాగంగా మొదటిగా మన కులం సర్టిఫికెట్ కోసం ఆర్డీవో దగ్గర నుంచి కాకుండా నేరుగా మండల ఎమ్మార్వో కార్యాలయంలోనే కులం సర్టిఫికెట్ జారీ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల అధ్యక్షులు దర్శనం గోపి, మండల ఉపాధ్యక్షులు దర్శనం వెంకన్న ముఖ్య నాయకులు మాస్టిన్ సోదరీ, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.