

డివైఎఫ్ఐ, టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి వినతి
జనం న్యూస్ 22మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ మున్సిపల్ కేంద్రానికి మారుమూల గ్రామల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఇతర అవసరాల రీత్యా రావడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు అధికంగా వస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం తో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ కూడా టాయిలెట్స్ కి పోదామంటే స్థలం లేదు, దానితో మహిళలు చాలా ఇబ్బందికి గురి కావలసిన పరిస్థితి అవుతుంది, అందుకని పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా నిర్మించలమి మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి డివైఎఫ్ఐ టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది, వీటితోపాటు మున్సిపల్ కేంద్రంగా రెండు చోట్ల జనకాపూర్, ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయాలి, మరియు వాహనాల కొరకు పార్కింగ్ స్థలం కేటాయించాలని కోరారు దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ త్వరలోనే పబ్లిక్ టాయిలెట్స్ ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేస్తామని పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని దీంతోపాటు ఓపెన్ జిమ్ములు పార్కింగ్ కొరకు స్థలాన్ని కూడా కేటాయిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం, టికానంద్, గొడిసెల కార్తీక్, టిఎజిఎస్ జిల్లా అధ్యక్షురాలు కొరెంగ మాలశ్రీ, పాల్గొన్నారు,