Listen to this article

దుకాణాలకు చెత్త డబ్బాలు పంపిణీ, ఫాం పౌండ్ శంకుస్థాపన

జనం న్యూస్,మార్చి22, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామాన్ని
జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి , ష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలిద్దాం అందరూ సహకరించాలన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిసరాల్లో పరిశుభ్రతపై కూడా ఉండాలని ఆయన దేశించారు..అనంతరం గ్రామంలో టిఫిన్,కాయగూరల దుకాణాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా డస్ట్ బిన్లు పంపిణీ చేశారు.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాలు పెంపొందించే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫాం పౌండ్ శంకుస్థాపనను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేశారు.ఈ కార్యక్రమంలో
అధికారులు,సర్పంచ్ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.