

జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) మండలం లోని సిరిపురం గ్రామం లో నాంచారమ్మ తల్లి, ఎల్లమ్మదేవి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఏకలవ్య ఎరుకల కుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 మంగళవారం రోజున ఎల్లమ్మ దేవి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు.