Listen to this article

గ్రామపంచాయతీ కార్మికులు మహా ధర్నాకు వెళ్ళుటకు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు పర్మిషన్ కోరకు లెటర్ అందజేసిన సీఐటీయూ నాయకులు జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ సంఘం పిలుపు మేరకు ఈ నెల 25న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఇందిరా పార్క్ వద్ద జరుగు మహా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం జిపి కార్మికులకు పిలుపునిచ్చారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నాకు వెళ్ళుటకు పర్మిషన్ కొరకై లెటర్ ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ… రాష్ట్ర బడ్జెట్ సమావేశం జరుగుతున్న సందర్భంగా గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేతనాలు పెంచాలని,పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలని, జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని,పాత కేటగిరీల న్నింటిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరినారు ఈ కార్యక్రమంలో జిపి జిల్లా ఉపాధ్యక్షురాలు బండారు గురవమ్మ, మండల అధ్యక్షులు ఎల్ నాగార్జున, ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.