Listen to this article

జనం న్యూస్, మార్చి -23, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) మే 19, 2025 లోపు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి క్రింద ఉన్నత చదువులకై అందించే ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ , బి.వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అందించే ఆర్థిక సహాయానికి అర్హులైన వారు (ఏదైనా 4 సంవత్సరాల డిగ్రీ చదివిన/చివరి సంవత్సరం చదువుతున్న) వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని,అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, మొదలగు దేశాలలో ఉన్నత చదువు చదివేందుకు వెళ్ళేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల పెద్దపల్లి జిల్లాలోని ఎస్సీ అభ్యర్ధులు https://telanganaepasscbbgov.in ద్వారా మే 19 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ , బి.వినోద్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.