Listen to this article

మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్,

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గజ్వేల్ పోరుబాట పాదయాత్ర సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి రాజ్ భవన్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం మూడవ రోజుకు చేరుకుంది.పాదయాత్రలో మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, లు పాల్గొన్నారు. మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధాకరమని,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటున్నారని,ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.