

జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం)
వర్షం కారణంగా రైతన్నలకు కన్నీరే మిగిలింది. వర్షాలు పడటంతో నడిగూడెం మండలంలో చాలా చోట్ల వరి పంట నేలకు ఒరిగాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగ్గా.. పెట్టుబడుల కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.