

జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం)
ఉపాధి కూలీలు వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో దాసరి సంజీవయ్య తెలిపారు. నడిగూడెంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న పనులను శనివారం పరిశీలించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున పని చేసేటప్పుడు కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ పద్మకు సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి పాల్గొన్నారు