

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మార్చి22, అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లారస్ కంపెనీ ట్రైనింగ్ హాల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శిక్షణ తరగతులు కార్యక్రమంలో అచ్యుతాపురం మునగపాక మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయితీ కార్యదర్శి లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలిలో ప్రతి గ్రామం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలిద్దాం అందరూ సహకరించాలన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిసరాల్లో పరిశుభ్రతపై పని చేయాలన్నారు. అనంతరం గ్రామంలో ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి పర్యావరణన్ని కాపాడాలని కోరారు. డ్రైనేజీలు కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు… ఈ కార్యక్రమంలో జాహ్నవి, డిపిఓ శిరీషారాణి, , వివిధ శాఖలకు చెందిన అధికారులు సర్పంచులు,పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.