

జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం)
శాంతి నగర్ నుంచి నడిగూడెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రహదారిని విస్తరించేందుకు గాను రెండు వైపులా కంపచెట్లను తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తిగావించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెడల్పుతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగనున్నాయి.