

జనం న్యూస్ మార్చ్ 22 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
అమలాపురం సమీపంలో చెయ్యరు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జలదినోత్సవమును జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎం శ్రీనివాస కుమార్ ముఖ్య అతిధిగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా నీటి యొక్క ఆవశ్యకతను, మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారం అని వివరించారు. ప్రపంచంలో దాదాపు 65 % సముద్రపు నీరు, 25 % మంచు కొండలు మరియు 7 % నదులు ,మిగిలిన 3 % నీరు మాత్రమే అందుబాటులో వుంది అని ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సంవత్సరం 2025 థీమ్ ” హిమని నదుల సంరక్షణ”. భూవాతావరణ ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం పెరగడం వలన సముద్ర మట్టం పెరుగుతుంది అని తెలిపారు. ఈ సందర్భం గ విద్యార్థులచే “నీటి పొదుపు” గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమము ఎన్ ఎస్ ఎస్ మరియు నెహ్రు యువ కేంద్ర అధ్యరం లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ& కరస్పాండెంట్ డివిఎన్ఎస్ వర్మ, కళాశాల పాలక వర్గ సభ్యులు సందీప్ లు, ఎన్ ఎస్ ఎస్ పి ఓ ఎం .వెంకటేశ్వర రావు కళాశాల విద్యాశాఖాధికారి డా॥ ఎస్.జయలక్ష్మి, వివిధ విభాగాని పతులు , అధ్యాపకులు, ఎస్ ఎస్ విద్యార్థులు పాల్గున్నారు.
