Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

పట్టణంలోని ఏడో వార్డులో కుమ్మరి కాలనీ నందుగల డాక్టర్ మరి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ చెమిటిగంటి పార్వతీదేవి హాజరయ్యారు, వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలు కూడా ఉన్నత విద్యా లక్ష్యాలను సాధిస్తున్నాయని, విద్యార్థులకు అత్యున్నతమైన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనతో పాటు డిజిటల్ విధానంలో బోధించడం కో కరిక్యు లర్ యాక్టివిటీస్ లో కూడా చాలా చక్కగా విద్యార్థులకు శిక్షణ ఇ స్తున్నారని తెలిపారు. పాఠశాల ఆవాస ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు నూతన విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల మౌలిక వసతులు కల్పనలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ, యూనిఫామ్ షూస్ సాక్స్ బ్యాగ్, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు నగదు ప్రభుత్వం అందిస్తుందని అందరూ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు, అనంతరం తరగతి వారీగా మొదట ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు, విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పి నరేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.సుద ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు ఏ నీలిమ ఎన్ అంజమ్మ ఎస్ఎంసి సభ్యులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.