

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 13 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలోని పెద్ద బండ కాలనీకి చెందిన హెల్పింగ్ హాండ్స్ యూత్ అసోసియేషన్ వారు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెగడపల్లి ఎస్ఐ సిహెచ్ రవి కిరణ్ మరియు నందగిరి సహకార సంఘం సొసైటీ చైర్మన్కర్ర భాస్కర్ రెడ్డి మరియు బొంబాయి రాజిరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రాకేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతిగా మాల కరుణ శ్రీ ద్వితీయ బహుమతిగా మాల రమ్య మరియు ఐలవేణి సువర్ణ గెలుపొందారు వీరికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెగడపల్లి ఎస్సై బహుమతులు అందజేశారు ఇదే కార్యక్రమంలో విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించి ఉన్నతలుగా తీర్చిదిద్దేందుకు 2023 24 సంవత్సరంలో అత్యధిక ప్రతిభ కనబరిచిన పదవ తరగతి విద్యార్థులకు ఇరిగేషన్ ప్రణయ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదవ తరగతి విద్యార్థులకు ఈ హెల్పింగ్ హాండ్స్ యూత్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు, యూత్ సభ్యులు మాట్లాడుతూ విద్యపరంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమమైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.