Listen to this article

జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆదివాసి మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కించపరిచేలా మాట్లాడడం సరైనది కాదని *ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతో అనుభవం ఉన్న మంత్రిని ఇలా కించపరచడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసి సమాజం మొత్తం రావి శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. బేషరత్తుగా మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆయన పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి పై చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.