Listen to this article

జనం న్యూస్ మార్చి 22 కాట్రేనుకున (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఐసిడియస్ సీడీపీఓ ఐ. విమల వారి ఆధ్వర్యంలో కాట్రేనికోన మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ పెనుమళ్ళ లక్ష్మీవాడ హైస్కూల్ నందు “పోషణ్ భీ పడాయి భీ” మూడు రోజుల ట్రైనింగ్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఈ కార్యక్రమాల నందు ఐసిడియస్ సూపర్వైజర్లు కెవివిఎస్ తులసి కుమారి, ఎల్ వి రమణి, సి హెచ్ జయవాణి అంగన్వాడీ కార్యకర్తలకు నవజాత శిశు సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు పిల్లలు లోప పోషణకు గురి కాకుండా ఎలా నివారించాలనే విషయాలు గురించి అవగాహన కల్పించారు.