

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రామగుండం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్రగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా మార్కుక్ మండలం గణేష్ పల్లి వరకు చేరుకున్న పాదయాత్రకు మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ వారికి ఘనస్వాగతం పలికి మజ్జిగ అరటి పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి,నాయకులు ఎంబరి రామచంద్రం,మంద బాల్ రెడ్డి, మ్యాకల కనకయ్య,పాండు గౌడ్, కృష్ణ యాదవ్,శ్రీరాములు,గోలి నరేందర్, రావికంటి చంద్రశేఖర్, పత్తి బాబు, భాస్కర్, అశోక్, సుధాకర్ రెడ్డి,ప్రసాద్, సంతోష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు