

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు, తన కార్యాలయం నుండి రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్టు, ఆస్తుల జప్తు, మరియు డీ-అడిక్షన్ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. గంజాయి అక్రమ రవాణాలో లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని ఆదేశించారు. ఈ కేసుల్లో ఉన్న నిందితులను తక్షణమే గుర్తించి డిటెయిన్ చేయాలని సూచించారు. గంజాయి వినియోగదారులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు 296 మంది బాధితులను డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 24 కొత్త చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, వారిపై ఉన్న ఎన్.బి.డబ్ల్యూ (NBW) లను ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, తక్షణమే చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గంజాయి పట్టుకున్న కేసులలో జాతీయ నార్కోటీక్స్ బ్యూరో కు రివార్డు కొరకు అప్లై చేయాలన్నారు. ఫోక్సో కేసుల్లో బాధితులకు కలెక్టర్ ల ద్వారా పరిహారం త్వరగా అందేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నారులు జరిగే నేరాలకు సంబంధించిన నిందితులపై షీట్ లను తెరవలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలలో భాగంగా శక్తి యాప్ & శక్తి బృందాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు. ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను త్వరితగతిన ఛేదించలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారితో పాటు, జిల్లా ఎస్పీలు శ్రీ తుహిన్ సిన్హా, శ్రీ అమిత్ బర్దర్, శ్రీ వకుల్ జిందాల్, శ్రీ మహేశ్వర్ రెడ్డి, శ్రీ మాధవ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు