Listen to this article

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నిమ్మాడలో గ్రామస్థులతో ముచ్చటించారు.సొంతూళ్లో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. భోగి పండగ వేళ కింజరాపు కుటుంబం అంతా ఒకే చోట చేరి ఆనందాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సిరి సంపదలతో రాష్ట్రం తులతూగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అనంతరం తనను కలిసిన గ్రామస్థులతో ముచ్చటించి, వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పండుగ వేళ సకల శుభాలూ కలగాలని, కూటమి ప్రభుత్వం వ్యవసాయదారులకు అండగా ఉండేందుకు నిరంతరం పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా గ్రామాలలో ఈ పెద్ద పండుగ చేసుకోవాలని, పల్లెల వృద్ధే దేశాభివృద్ధి అని అన్నారు. ఆయన వెంట కింజరాపు హరి వరప్రసాద్‌, గ్రామస్థులు ఉన్నారు.