

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్.పి. వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికల్యాణ్ చక్రవర్తి కూడా వున్నారు. జారీ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం