Listen to this article

జనం న్యూస్ మార్చి 23 :సంగారెడ్డి జిల్లా,పఠాన్ చెరు పట్టణ పరిధిలో గల మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ముస్లిం

సోదరులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పఠాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు..అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్ష చేస్తుంటారనీ, కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా పండుగ ను నిర్వహిస్తారని తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి అన్నారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం ఆదిత్య రెడ్డి స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఇఫ్తార్ విందు లోపాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్య నేతలకు, మైనారిటీ సోదరులకు పేరుపేరునా వాదాలుతెలియజేశారు.ఈ కార్యక్రమంలో బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ,,సంజీవ, ఇస్నాపూర్ మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, పోచారం మాజీ సర్పంచ్ జగన్,అభిబ్ జానీ, అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, బీరంగూడ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, జిన్నారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ,ఆసిఫ్ , మీయాభాయి ,ఇమ్రాన్ , అత్తార్ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.