Listen to this article

బిచ్కుంద మార్చ్ 23 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని గోపన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న క్రషర్ మిషన్, డాంబర్ ప్లాట్ ను తొలగించాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు. శనివారం అధికారులు క్రషింగ్ మిషన్ ను, డాంబర్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ క్రషర్ మిషన్ డాంబర్ ప్లాంట్ తో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చాలామంది రోగాల బారిన పడ్డారని పేర్కొన్నారు. డాంబర్ పాంట్లు లో వచ్చే పొగ, దుర్వాసనతో గ్రామస్తులు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి పాలై మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ప్లాంటుకు పర్మిషన్ లేకుండా అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుండి ఆ రెండు ప్లాంట్లను తొలగించి గ్రామస్తులను కాపాడాలని అధికారులకు గ్రామస్తులు వేడుకున్నారు. ఈ విషయంపై అధికారులు కలెక్టర్ కు నివేదిక పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.