

జనం న్యూస్ మార్చి 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
నేటి యువత భగత్‌సింగ్ అడుగుజాడల్లో నడవాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పిలుపునిచ్చారు.భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడారు..భగత్‌సింగ్ చదువుతున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు.సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన లే ని సమ సమాజం కోసం పోరాడడమే భగత్‌సింగ్ కు అర్పించే నిజమైన నివాళియని పేర్కొన్నారు.భగత్‌సింగ్ దేశానికి చేసిన సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.