Listen to this article

జనం న్యూస్, మార్చ్ 24,(తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ విజయ్ కుమార్)

మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల ఎనిమిది న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే, తొలి విడతలో 150 మహిళా శక్తి బస్సులను సమకూర్చగా వాటిలో ఇరవై బస్సులను వివిధ డిపోలకు టాయించారు.
ఇల్లందు, పరకాల, జనగా మ,నర్సంపేట, భూపాల పల్లి, వరంగల్ రెండు,జగిత్యా ల, హుస్నాబాద్, మంథని, హుజురాబాద్, వేముల వాడ మహబూబ్ నగర్, వనపర్తి డిపోలకు ఒక్కొక్క టి చొప్పున కేటాయించారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళ బస్సులను ప్రవేపె డుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో ఆర్టీసీ అధికారులు 150 మహిళ బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో విడతలో 450 మహిళ శక్తి బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.