Listen to this article

జనం న్యూస్ 24 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 94 వ వర్ధంతి సందర్భంగా రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది… శ్రీ శ్రీ ఇనిస్ట్యూట్ మేనేజ్మెంట్ శ్రీనివాసరావు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపని ప్రారంభిస్తూ… 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుఖదేవ్.. అతి చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమం కోసం దాడిన వెరకిషోర్లని బ్రిటిష్ ప్రమాదకరమైన చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని పోరాడారు. యువత ప్రోత్సాహంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినందుకు డివైఎఫ్ఐ సంఘం మరింతగా సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు.. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచన చంపలేరు వారు నా శరీరాన్ని నలిపివేయగలరు గాని నా ఆత్మను నలిపివేలేరు అంటూ రవి అస్తమించిన బ్రిటిష్ సమాజాన్ని ఎదురు నిలిచిన యువ కెరటం భగత్ సింగ్ ఈ పేరు వింటే చాలు భారతీయ నరాల్లో మిత్రుడు ఉడుకుతుంది గర్వంతో ఉప్పొంగుతుంది.. స్వతంత్ర ఉద్యమ చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని విప్లవం వర్ధిల్లాలని నినాదం ఇస్తూ అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో పగబంబు వేసి పారిపోవడానికి అవకాశం ఉన్న పారిపోకుండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గలగల లాడించి యువకుల్ని విద్యార్థులను ప్రజల్ని స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేసిన ఘనత వీరేదని చెప్పారు. ఇప్పుడున్న సందర్భంలో రక్తం దానం చేయడం అనేది చాలా నిత్యవసరమని కళ్ళు మూసి చేరుకునే లోపు యాక్సిడెంట్ లో జరుగుతున్నాయి . రక్తం అందక చాలా మంది చనిపోతున్నారు.. గర్భిణీ స్త్రీలలో డెలివరీ సమయంలో రక్తం మందకా శిశు మరణ రేటు కూడా పెరిగిపోతుంది కావున రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడాలని. కోరారు.. భగత్ సింగ్ శయాలతోసమాజంలోకి వస్తున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని. కేంద్ర ప్రభుత్వం పేదలపై అదనమైన పన్నులు విధిస్తూ కార్పొరేట్లకు వేలకోట్లు అప్పులు మాఫీ చేస్తున్నాయని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు ఇటువంటి సమాజాన్ని కోరుకోలేదని కావున వారికి నిజమైన నివాళి అర్పించడం అంటే ఖాళీ ఉద్యోగాల కోసం, విద్యా వైద్యం కార్పొరేటి కరణకు వ్యతిరేకంగా మరియు అన్నిటిలో సమాన అవకాశాలు అందించే సోషలిస్టు వ్యవస్థ కోసం ఉద్యమాలు నిర్వహించడమే అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పార్ధు,వాసు,1 ఆదిత్య మేఘన, వెన్నెల, సాయి రాజశేఖర్,యువకులు పాల్గొన్నారు.