

జనం న్యూస్ 24 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ సందర్భంగా పోలీసు మెడల్స్ ను కటించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 23న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తూ, ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఉగాది పండగ సందర్భంగా పోలీసు సేవా మెడల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపామన్నారు. పోలీసుశాఖ పంపిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న (1) విజయనగరం ఎస్బీలో ఎస్ఐగా పని చేస్తున్న వై.సత్యన్నారాయణకు ఉత్తమ సేవా పతకం (2) విజయనగరం ఎస్సీ మరియు ఎస్టీ సెల్లో పని చేస్తున్న ఎఎస్ఐ ఎం.ప్రసాదరావుకు సేవా పతకం (3) గుర్ల పోలీసు స్టేషనులో హెచ్సిగా పని చేస్తున్న పి.రమణ (4) కానిస్టేబులు కే.గోపాలరావులకు సేవా పతకాలు (5) ఆర్మ్డ్ రిజర్వులో ఎఆర్ఎస్ఐగా పని చేస్తున్న కే.అప్పలరాజు (6) ఎఆర్ హెడ్ కానిస్టేబులు ఎం.గోవిందం (7) ఎఆర్ కానిస్టేబులు బి.శ్రీనివాసరావులకు సేవా పతకాలకు ఎంపికైనట్లుగా, రాష్ట్ర హెూంశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను రాష్ట్ర స్థాయిలో నిలిపి, ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సేవ, సేవా పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేసి, జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను ఇనుమటింప జేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆకాంక్షించారు.