

జనం న్యూస్ మార్చ్ 24 వికారాబాద్ జిల్లా
పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన రాగపురం నర్సింలు 33 సంవత్సరాలు తన స్నేహితులతో కలిసి చేపల వేటకు శనివారం సాయంత్రం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో వలవేస్తుండగా కాళ్లకు చుట్టుకుని చెరువులో మునిగిపోవడం జరిగింది. శనివారం చీకటి పడడంతో ఆదివారం ఉదయం వెతకడంతో మృత దేహం దొరకడం జరిగింది. అతని మృతదేహం పై ఎలాంటి అనుమానం లేదని అతని భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.