

జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదూరి రేణుక శివకుమార్..
జనం న్యూస్ // మార్చ్ // 24 // కుమార్ యాదవ్// ( జమ్మికుంట )
హుజురాబాద్ నియోజకవర్గం-జమ్మికుంట పట్టణం..పూదరి రేణుక-శివకుమార్ గౌడ్, జమ్ముకుంట పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. చిరుప్రాయములోనే ఛిద్రం అవుతున్న బాల్యం ఉజ్వల భవిష్యత్ ఉన్న బాలలు 18సం. రాలు నిండకుండానే వారి ఇష్టానుసారం రోడ్లపై మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాధాలకు కారకులవ్వుతూ, వారు అర్థర్తరంగా తనువు చాలీస్తు, కన్నవారికి పుత్రశోకము మిగులుస్తున్నారు. మరియు అంగవైకల్యము తెచ్చుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రులు, మరియు గురువులు, మేధావులు అందరు కూడా చోరువ తీసుకోవాలి, మైనారిటి తీరక ముందు తల్లిదండ్రులు పిల్లలకు బైకు లు ఇవ్వరాదు, అన్నారు.ఒక వేళ బైకు ఇచ్చినట్లు అయితే వారి మీద కూడా కేసులు నమోదు చేయాలి, అని తెలిపారు.మొన్ననే మన కళ్ళముందే మైనర్ బాలుడైనా అనుదీప్ మరణం జీర్ణించుకోలేము, అని వివరించారు. దయముయులైన సమాజ సేవకులారా, భాద్యత గల పోలీసు అధికారులు, హుజురాబాద్ యం. వి. ఐ లు మీ వీలును బట్టి మైనర్ డ్రైవింగ్ పైన, కలిగే నష్టలపైన అవగాహన కార్యక్రమాలు నిర్యహించాలని, సూచించారు.బైక్ డ్రైవింగ్ కు ఉండాల్సిన వయస్సు, అర్హతలు, శిక్షల గురించి తెలియజేయాలని, మా వంతు భాద్యతను మేము కూడా మీతో పాలు పంచుకుంటామని, అన్నారు. భవిష్యత్ తరాలకు యువత యొక్క పాత్ర, భాద్యత ఎంతో విలువైంది కావున రోడ్ ప్రమాదాల నివారణ మనందరి భాద్యత అని అందరం పోలీసు, యం. వి.ఐ. పాఠశాల యజమాన్యాలు మరి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు మైనర్ బైక్ డ్రైవింగ్ ను ప్రోత్సాహించవద్దని, నష్టం జరిగిన తర్వాత చేసేది ఏమి ఉండదని, నష్టం జరుగకుండా జగరాతతో ఆలోచించాలని, మైనర్ బైక్ నడుపుతూ కనపడితే, బైక్ సీజ్ చేస్తూ, నడిపిన పిల్లవాడి పై అతని తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేయాలని, కఠినంగా వ్యవహారిస్తే తప్ప మార్పు సాధ్యం అయ్యేటట్లు లేదు కనుక మనందరం కలిసి బాధ్యతగా మైనర్ బైక్ డ్రైవింగ్ ను అరికట్టెందుకు కనకనబద్దులము అవుదామని కోరారు.
