Listen to this article

జనం న్యూస్ మార్చి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతి నిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచార ణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు శ్యామ లను విచారిస్తున్నారు. ఇదిలాఉంటే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హై కోర్టులో శ్యామల పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమెను అరె స్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించా లని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట ఈరోజు విచారణకు హాజరయ్యారు.