Listen to this article

క్షయ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

క్షయ రహిత సమాజం ద్వేయంగా కృషి చేయాలి

డాక్టర్ బి.వినయ్ కుమార్

జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష

ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్వాలి,ప్రతిజ్ఞ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ. టీ. బి వ్యాధి తుంపర్ల,గాలి ద్వారా ఒకరి నుండి ఒకరి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధి అని వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వాడితే పూర్తిగా నయమయ్యే జబ్బు టీ.బి అని తెలిపారు.వ్యాధి లక్షణాలు వారం పాటు ఎడతెరపి లేకుండా తెమడతో దగ్గు,సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించటం, బరువు కోల్పోవడం,ఆయాసం, ఛాతీలో మంట వీటిలో ఒకటి,రెండు లక్షణాలు ఉన్నట్లయితే ల్యాబ్ ద్వారా లేదా ఎక్స్రే రే ద్వారా పరీక్షలు చేయించి నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు వాడాలని కోరారు.వ్యాధి బారిన పడిన వారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలనీ, మందులు సక్రమంగా వాడాలని సూచించారు.భారత దేశం నుండి 2030వ సంవ్సరం వరకు టీ.బి నీ పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరోగ్య విస్తరణ అధికారి బి.భాస్కర్ రాజు సూపర్వైజర్ బి. జయమ్మ నర్సింగ్ ఆఫీసర్ సునీత ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర ఏఎన్ఎంలు బి పద్మ కె పద్మ నరసమ్మ ఆశా లు సుధా,జ్యోతి,వెంకటమ తదితరులు పాల్గొన్నారు.