

జనం న్యూస్ // మార్చ్ // 24 // కుమార్ యాదవ్//( జమ్మికుంట)
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ వేలం ఈ నెల 27న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 10 గంటల వరకు చిన్న షెటర్ కు 5000 రూపాయలు పెద్ద షెటర్ కు 10000 రూపాయలు డిపాజిట్ చెల్లించిన వారు వేలంలో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా 9177333771 ఫోన్ నెంబర్ కు సంప్రదించలని సూచించారు.