Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 24 // కుమార్ యాదవ్// ( జమ్మికుంట )

గౌడ హక్కుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడుతున్న గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ సేవలు ప్రశంసనీయమని జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గండి రంజిత్ కుమార్ గౌడ్ ను జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ లు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిన్న వయసులోనే ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టి, గౌడ కులస్తులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా గౌడ కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న, రంజిత్ సేవలు అభినందనీయమని వారు కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గండి రంజిత్ కుమార్ గౌడ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.