

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్
( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్ట్
నేడు హైదరాబాద్ లోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన ఆశ కార్యకర్తలను అరెస్టు చేసిన బిచ్కుంద పోలీసులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసన కు బయలుదేరిన తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు శోచనీయం అని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టు లకు పాల్పడకుండా న్యాయమైన ఆశ కార్యకర్తల డిమాండ్ లను పరిష్కరించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా సురేష్ గొండ డిమాండ్ చేశారు.
లేని యెడల ఉద్యమం తీర్వతరం చేస్తామని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్నికి హెచ్చరికలు జారీ చేశారు.