Listen to this article

జనం న్యూస్ మార్చ్ 24 వికారాబాద్ జిల్లా

మహిళా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్న మిస్స్ వరల్డ్ పోటీలను మహిళలు అందరూ వ్యతిరేకించాలని పిఓడబ్ల్యు జాతీయ నాయకులు సంధ్యా ఝాన్సీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య కేంద్రంలో షోయబ్ హాల్లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా సంధ్యా, ఝాన్సీ, మాట్లాడుతూ మహిళల శరీరాలను ప్రదర్శన వస్తువుగా, మార్చి సామ్రాజ్యవాద మార్కెటుకు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలను హైదరాబాద్ వేదిక కావడం ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ ప్రధాన కార్యదర్శి అందిమంగా, ఐధ్వ, అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఎన్ఎఫ్టి అధ్యక్షురాలు జ్యోతి, ప్రగతిశీల మహిళా రాష్ట్ర కన్వీనర్ వై గీత మహేందర్, రచయితలు కమల,విజయ,చైతన్య మహిళా సంఘం నాయకురాలు జయ, శ్రీదేవి, యశోద,తదితరులు పాల్గొన్నారు.