Listen to this article

జనం న్యూస్ మార్చ్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

84 వ వార్డు కొండ కొప్పాక గ్రామంలో కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి స్మశానo బహిరంగంగా ఉండటంవల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలియజేసిన మేరకు జీవీఎంసీ సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకొని ప్రహరీ గోడకు నిధులు మంజూరు చేశారని, 25 లక్షలు జీవీఎంసీ నిధులు మంజూరు చేశారని నీలాబాబు తెలియజేశారు. ఈరోజు ఉదయం సచివాలయంలో సమగ్ర సర్వే పై అవగాహన కల్పించడానికి కొండ కొప్పాక సచివాలయంలో మహిళలతో సమావేశం అనంతరం ప్రజలు విజ్ఞప్తిపై స్మశానవాకటి పరిశీలనకు సచివాలయ సిబ్బంది తో నీలబాబు కలిసి పనులు జరుగుతున్న విషయాలను ఏఈ ని అడిగి తెలుసుకుని తొందరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు నీలాబాబు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వానపల్లి బాబురావు బోయిన మురళి వామాల కాశీ జనసేన నాయకులు గిరి గోపి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.